
` కరెన్‌జిత్ కౌర్ వోరా ` అంటే ఎవరు అనుకోకండి.. అదే సన్నీలియోన్ అసలు పేరు. 1981 మే 13 న కెనడాలో ఒక సిక్కు పంజాబీ కుటుంబంలో సన్నీ జన్మించింది. చిన్నతనంలోనే ఫుట్‌బాల్, ఐస్ స్కేటింగ్, హాకీ లాంటివాటిల్లో ఎంతో హుషారుగా సన్నీ లియోన్ పాల్గొనేది. యుక్త వయసులో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి చాలా ఫేమస్ అయ్యింది. 2011లో ఆమె ఇండియన్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనడం ద్వారా ఇండియాలోనూ గుర్తింపు తెచ్చుకుంది.
ఈ షో సమయంలోనే ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ సన్నీలియోన్ ను ఒక సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చారు. అదే ` జిస్మ్ 2 `. 2012లో ఆమె తన మొదటి బాలీవుడ్ చిత్రం జిస్మ్ 2తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఇందులో తనదైన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సన్నీ ఆకట్టుకుంది. సినిమా విమర్శలకు గురైనప్పటికీ, కమర్షియల్‌గా హిట్ అయింది. దాంతో సన్నీకి మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ నటనా రంగంలో స్థిరపడిన సన్నీలియోన్.. ఐటెం సాంగ్స్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది.
హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా సన్నీలియోన్ యాక్ట్ చేసింది. తెలుగులో కరెంట్ తీగా, జిన్నా, మందిర, గరుడ వేగ వంటి చిత్రాల్లో మెరిసింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో విమర్శలున్నప్పటికీ, ఆమె తన శ్రమ, ఆత్మవిశ్వాసం, మంచి బిహేవియర్ తో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. నటిగా కాకుండా సన్నీ వ్యాపారరంగంలో సత్తా చాటుతోంది. ` స్టార్ స్ట్రక్ ` పేరుతో స్వంతగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ ను నడుపుతోంది.
ఇకపోతే అడల్ట్ మూవీస్‍లో తనతో కలిసి నటించిన డేనియెల్ వెబర్ అనే అమెరికన్ వ్యక్తిని 2011లో సన్నీలియోన్ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారు. అలాగే నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు. ఆస్తుల విషయానికి వస్తే.. నటిగా, ఐటెం డ్యాన్సర్‌గానే కాకుండా వ్యవస్థాపక కార్యక్రమాల ద్వారా కూడా సన్నీ సంపాదిస్తుంది. పలు నివేదికల ప్రకారం.. ఆమె ఆస్తుల విలువ రూ. 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.