గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ ఎన్నో గొడవలు పడుతున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా మంచు మనోజ్ బయటకి వచ్చి మంచు మోహన్ బాబు యూనివర్సిటీ లో అవకతవకలు జరుగుతున్నాయని, అక్కడ అన్యాయం జరుగుతుంది అని, దీనంతటికి కారణం మోహన్ బాబు దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి తో పాటు విష్ణు కూడా అని,విష్ణు ఇలా తండ్రికి తెలియకుండా ఎన్నో ఘోరాలు చేస్తున్నారంటూ మనోజ్ మీడియా ముందుకొచ్చి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న మోహన్ బాబు యూనివర్సిటీ తాజాగా మరో వివాదం లో ఇరుక్కుంది. ఓ విద్యార్థి ని కిడ్నాప్ చేసిన ఇష్యు ప్రస్తుతం బయటికి వచ్చింది. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. 

గత కొద్ది రోజుల నుండి మోహన్ బాబు యూనివర్సిటీ లో విద్యార్థులను ఫీజుల పేరు తో వేధిస్తున్నారు అంటూ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ లో చదువుకునే జేమ్స్ అనే వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో షేర్ చేశారు. అందులో ఏముందంటే.. జేమ్స్ అనే వ్యక్తి తన కంటే జూనియర్ అయినటువంటి యశ్వంత్ కిడ్నాప్ చేశారు. జేమ్స్ ని యశ్వంత్ ప్రతిసారి కులం పేరుతో దూషించారట. 

 అయితే చాలా రోజులు ఓపిక పట్టిన జేమ్స్ ఆ తర్వాత ఓసారి యశ్వంత్ కి వార్నింగ్ ఇచ్చారట. ఇక దాన్ని ఓర్చుకోలేని యశ్వంత్ 13 వ తేదీన జేమ్స్ ని రౌడీ షీటర్ల తో కలిసి  కిడ్నాప్ చేసి ఒక రూమ్లో రెండు రోజులు బందించి చిత్ర హింసలు పెట్టి, మూత్రం కూడా తాగించాడంటూ ఒక సంచలన సెల్ఫీ వీడియో ని బయట పెట్టాడు జేమ్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మరోసారి మోహన్ బాబు యూనివర్సిటీ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: