ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `బాహుబ‌లి` సినిమాతో టాలీవుడ్ స‌త్తా ఏంటో ప్రపంచ‌స్థాయికి చాటిచెప్పారు. ప్రాంతీయ స్టార్ గా ఉన్న ప్ర‌భాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే.. బాహుబ‌లికి ముందు, బాహుబ‌లి త‌ర్వాత అనే చెబుతారు. అంత‌టి సెన్సేష‌న్ ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే బాహుబ‌లి టైమ్‌లో రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయంటూ ఓ న్యూస్ బాగా వైర‌ల్ అయింది.


అప్ప‌టికే రాజ‌మౌళి, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి`, `య‌మ‌దొంగ‌` వంటి చిత్రాలు విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేశాయి. ఆన్ స్క్రీన్ పై హిట్ కాంబోగా గుర్తింపు పొందిన రాజ‌మౌళి, ఎన్టీఆర్‌.. ఆఫ్ స్క్రీన్‌లోనూ చాలా స‌న్నిహితంగా ఉండేవారు. అయితే బాహుబ‌లి స‌మ‌యంలో మెయిన్ లీడ్ గా ఎన్టీఆర్ ను తీసుకోక‌పోవ‌డం ప‌ట్ల అభిమానులు చాలా నిరాశ చెందారు. ఇదే విష‌యంలో ఎన్టీఆర్ కూడా హ‌ర్ట్ అయ్యాడ‌ని.. ఆ కార‌ణంగానే రాజ‌మౌళితో ఆయ‌న‌కు విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని అప్పట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.


రాజ‌మౌళి, ఎన్టీఆర్ మ‌ధ్య దూరం పెరుగుతుందంటూ ప‌లు వెబ్‌సైట్లు క‌థ‌నాలు రాశాయి. అయితే చివ‌ర‌కు ఈ వార్త‌ల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ స్వ‌యంగా ఖండించారు. రాజ‌మౌళితో నాకు ఎటువంటి విభేదాలు లేవు.. బాహుబలి నాకోసం కాదన్న విషయం నాకు మొదట్లోనే క్లియ‌ర్ గా చెప్పారు. నేను కూడా ప్రభాస్‌కే ఆ పాత్ర సూటవుతుందని ఆయ‌న‌తో అన్నాను అంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చి రూమ‌ర్ల‌కు చెక్ పెట్టాడు. ఇక ఆ త‌ర్వాత రాజ‌మౌళి, ఎన్టీఆర్ క‌ల‌యిక‌లో `ఆర్ఆర్ఆర్` వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎన్టీఆర్‌, రాజ‌మౌళి మ‌ధ్య‌ ఎటువంటి మనస్పర్థలు లేవన్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: