ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో తనదైన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్టైల్ తో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఎన్టీఆర్ తన కెరీర్ లో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలలో కొన్ని డిజాస్టర్ కాగా మరికొన్ని పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. తాజాగా  ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాను నటించిన వార్-2 సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా.... కియారా అద్వానీ హీరోయిన్ గా చేసింది. ఇందులో ఎన్టీఆర్ కీలకపాత్రను పోషిస్తున్నారు.  తాజాగా  పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. "గెట్ రెడీ ఫర్ వార్" అంటూ ఎన్టీఆర్ డైలాగ్ తో కూడిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.

ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా చేసింది. కాగా ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో జాన్వి, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కారణంగా జాన్వికపూర్ ఈరోజు ఎన్టీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా ట్రీట్ ఇచ్చిందట. అంతేకాకుండా తనకోసం మంచి గిఫ్ట్ అందించినట్లుగా సినీ సర్కిల్స్ లో జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ గిఫ్ట్ ఏంటి అనేది రివిల్ చేయలేదు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజును ఘనంగా జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: