గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ కి , సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ కి కమిట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చరణ్ , సుకుమార్ కాంబోలో రూపొందబోయే సినిమా చరణ్ కెరియర్లో 17 వ సినిమాగా తెరకెక్కేనుండడంతో RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. కానీ చరణ్ లైనప్ మొత్తం తేడా కొట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ది సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ తో కాకుండా కిల్ మూవీ దర్శకుడు అయినటువంటి నిఖిల్ నాగేష్ బట్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేసే ఆలోచనలో చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు మూవీల తర్వాత సుకుమార్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సినిమాను పక్కన బెట్టి చరణ్ మరో ఇద్దరు దర్శకులతో సినిమా పూర్తి చేసి అప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా లేక పెద్ది సినిమా కంప్లీట్ కాగానే సుకుమార్ తో మూవీ ని మొదలు పెడతాడా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: