
జూన్ 12న హరిహర వీరమల్లు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో సంగీత దర్శకుడు కీరవాణి `కొల్లగొట్టినాదిరో..` అనే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి స్టెప్పులేసింది అనసూయ. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా కన్ఫామ్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరమల్లు ఐటమ్ సాంగ్ కోసం అనసూయ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రెండు రోజుల్లోనే `కొల్లగొట్టినాదిరో..` స్పెషల్ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశారు. అయితే కేవలం రెండు రోజులు కాల్ షీట్స్ ఇచ్చినందుకే అనసూయ ఏకంగా రూ. 50 లక్షలు రెమ్యునరేషన్ చార్జ్ చేసిందట. ఈ విషయం తెలిసి హీరోయిన్లే షాక్ అవుతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, గతంలో `అత్తారింటికి దారేది` చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయమని అనసూయకు ఆఫర్ వచ్చింది. కానీ ఆ సమయంలో ప్రెగ్నెంట్ గా ఉండటం వల్ల నో చెప్పిన అనసూయ.. ఇప్పుడు `హరిహర వీరమల్లు`లో పవన్‌తో కలిసి స్టెప్పులేసి తన కోరికను నెరవేర్చుకుంది. ఈ విషయంలో తాను ఎంతో గర్వంగా ఉన్నానని కూడా అనసూయ చెప్పడం విశేషం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు