ఈ మధ్యకాలంలో చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లు వివాహాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లని రెండోవ పెళ్లి చేసుకున్నారు. మొదట నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నారు. అలాగే అక్కినేని అఖిల్ కూడా ఇంటివాడు కాబోతున్నాడు. జైనబ్‌ రవ్జీతో నిశ్చితార్థం కూడా జారిగింది. త్వరలోనే అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నటుడు నారా రోహిత్‌, ప్రతినిధి 2 హీరోయిన్‌ శిరీషతో త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.

అయితే ఈ నేపథ్యంలో ఇటీవల యాంకర్ సుమ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఓ ప్రశ్న అడిగింది. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటని అడగగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొంతమంది హీరోలు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి హీరోస్ ని స్ఫూర్తిగా తీసుకొని.. తాను కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకుంటున్నట్లు హాస్యస్పదంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న చేసుకున్నారు. అలాగే హీరో నాగార్జున, అక్కినేని నాగచైతన్య, తమిళ నటుడు కమల్ హాసన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మొదట అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతోనే సినీ నటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సాక్ష్యం, జయ జానకి నాయక, స్పీడున్నోడు, కవచం, సీత, అల్లుడు అదుర్స్ సినిమాలలో నటించాడు. బెల్లంకొండ శ్రీను 2019లో తెరకెక్కిన రాక్షసుడు సినిమాతో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో హీరో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: