సినిమా ఇండస్ట్రీలో మూడు రకాల హీరోయిన్లు ఉంటారు . చేతికి వచ్చిన అవకాశం చాలు ఏదో ఒకటి చేసుకుని బతికేసి డబ్బులు తీసుకుందాం .. అనుకునే క్యాటగిరి హీరోయిన్స్ ఒకరు . ఎంత టైం వేచి చూసిన పర్వాలేదు పర్ఫెక్ట్ కాంబో సెట్ అవ్వాలి .. జాక్పాట్ ఛాన్స్ కొట్టాలి . అప్పుడే మన పేరు మారుమ్రోగిపోతుంది అని అనుకొని ముందు వచ్చిన చిన్న చిన్న అవకాశాలను వదులుకునే హీరోయిన్లు వేరు . స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత కూడా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి కొంతమంది హీరోయిన్స్ ట్రై చేస్తూ ఉంటారు .


అయితే కొంతమంది నిజాయితీగానే హీరోలను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తే మరి కొంత మంది మాత్రం స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలని మాత్రమే సపోర్ట్ చేస్తూ.. అలా వాళ్ళ సినిమాల్లో నటించడానికి ఓకే చేస్తూ ఉంటారు.  అప్పట్లో కాజల్ - సమంత - రకుల్ ఈ విధంగానే సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురయ్యారు . కాజల్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది స్టార్ బ్యూటీ . ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.  అలాంటి ఒక హీరోయిన్ అసలు హిట్టే లేని హీరోతో నటించింది . ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.



హీరో మరెవరో కాదు "బెల్లంకొండ సాయి శ్రీనివాస్".  కాజల్ - బెల్లంకొండ కాంబోలో వచ్చిన సినిమా "సీత".  ఈ సినిమా ఫ్లాప్ అయింది . అసలు కాజల్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకుంది..? అంటూ అప్పట్లో కాజల్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . కేవలం కాజల్ మాత్రమే కాదు సమంత - రకుల్ ప్రీత్ సింగ్ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటించారు . ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఎలా వీళ్లు నటించారు అంటే మాత్రం కేవలం ఆయన వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్.. డబ్బు అంటూ అప్పట్లో బాగా జనాలు ట్రోల్ చేశారు .



అదే మిగతా చిన్న హీరో సినిమాలలో నటించమంటే నో చెపుతారు..దానికి కారణం కేవలం డబ్బు. డబ్బు కోసమే ఈ హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో నటించారు అంటూ అప్పట్లో హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు . అంతేకాదు వీళ్ళు ఎంత కష్టపడి ట్రై చేసినా వాళ్ళ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఉపయోగించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిట్ మాత్రం కొట్టించలేకపోయాడు . అంతేకాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కారణంగానే  జనాలు  వీళ్ళని ట్రోల్ చేసేవారు. కాజల్ - సమంత - రకుల్  కూడా బాగా ట్రోలింగ్ కి గురి అయ్యారు.  అప్పట్లో కాజల్ - సమంత - రకుల్ ఫ్యాన్స్ కూడా ఆ ఉసురు ఊరికే పోదు  బెల్లంకొండకు అంటూ ఘాటుగానే కౌంటర్స్ వేశారు . నిజమే ఇప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక్కటి అంటే ఒక హిట్ కొట్టలేదు. రాక్షసుడు సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ అది అంతా అనుపమ ఖాతాలోకే వెళ్ళింది.  ఆయన వెనుక బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆయన వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు ఎవరు..? అనేది అందరికీ తెలుసు . ఆయన హిట్ కొట్టలేకపోతున్నాడు అంటే కారణం ఆయనలో చెప్పుకోతగ్గ టాలెంట్ లేదని అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: