
ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ఈ క్రమంలోనే 11 ఉత్తమ చిత్రాలకు గాను ఒక్కో చిత్రానికి 10 లక్షల రూపాయలు.. అలాగే రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 7 లక్షల రూపాయలు.. మూడవ ఉత్తమ చిత్రాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున బహుమతులు ఇవ్వబోతున్నారు. అలా సుమారుగా 25 కోట్లతో గద్దర్ ఫిలింఫేర్ అవార్డుల ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ గద్దర్ అవార్డులకు మొత్తం నామినేషన్లు 1248 రాగ వీటిని పరిశీలించిన అనంతరం అవార్డుల గ్రహీతల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది.
సుమారుగా 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గద్దర్ పురస్కారాలను సైతం చాలా గ్రాండ్గా చేయాలని భావిస్తోంది. జూన్ 14వ తేదీన హైదరాబాదులో హైటెక్స్ లో ఫిలింఫేర్ అవార్డులు ఇవ్వబోతున్నారు. ఈ అవార్డులలో భాగంగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఉత్తమ సినిమాగా కల్కి సినిమా నిలువగా.. వీటితో పాటు హీరోయిన్ నివేదా థామస్ కి అలాగే పలువురి సిని సెలబ్రిటీలకు కూడా గద్దర్ అవార్డులలో స్థానం లభించింది. మొత్తానికి మళ్లీ తెలంగాణలో అవార్డుల పండుగ జరగబోతోంది. మరి ఈ అవార్డుల వేడుక ప్రతి ఏడాది కొనసాగిస్తారో లేదో చూడాలి మరి.