సీనియర్ హీరోగా మంచి స్టార్ డమ్ సంపాదించిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం నటుడుగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా రాజేంద్రప్రసాద్ ఎవరో ఒకరి పైన నోరు జారుతూ బూతులు తిడుతూ వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నటుడు ఆలీని అందరి ముందు తిట్టినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు రాజేంద్రప్రసాద్ కూడా వెళ్లడం జరిగింది.


ఇక రాజేంద్రప్రసాద్ మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉండగా దురుసుగా కొన్ని పదాలు వాడినట్లు తెలుస్తోంది.. మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు రాకుంటే నేను మిస్ అయ్యే వాడిని.. ఏరా అచ్చన్న.. బయటికి రా నీ సంగతి చూస్తా అంటూ మాట్లాడారు.. ఆ తర్వాత మా ఇద్దరికీ ఇది అలవాటే అంటూ .. ఇక ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు లం*కొడుకు .. ఇదంతా మనకు కామనే అంటూ మాట్లాడారు రాజేంద్రప్రసాద్. ఇక తర్వాత నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాను అని చెప్పిన ఎవరు చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అని మరి అడిగి కొట్టించుకున్నారు రాజేంద్రప్రసాద్.



అంతేకాకుండా అక్కడున్న వారందరినీ కూడా మీ అందరికీ బ్రెయిన్ పోయిందా అంటూ ఏవేవో మాటలు మాట్లాడారు. చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్టే అంటూ చాలా అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ సైతం రాజేంద్రప్రసాద్ ని తిట్టిపోస్తున్నారు. నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో కూడా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను బూతులు తిట్టినప్పటికీ చివరికి మళ్ళీ సారీ కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కమెడియన్ ఆలీని ఇలా అందరి ముందు ఘోరమైన మాటలు మాట్లాడడంతో చాలామంది రాజేంద్రప్రసాద్ ను విమర్శిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: