- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో వార్ 2 సినిమా ఒకటి. ఈ సినిమాను బ్ర‌హ్మాస్త‌ దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ డైరెక్టర్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ .. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వ‌చ్చిన‌ ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉంది చెప్పేందుకు నిదర్శనం తాజా సంఘటన.


వార్ 2 సినిమా రిలీజ్ కూడా 75 రోజుల టైం ఉండగానే ఓవర్సీస్ లో బుకింగ్స్ మొదలుపెట్టారు. దీంతో ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమాపై మేకర్స్ ఆ రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉంటే .. ఇలా 75 రోజులు ముందే టికెట్ బుకింగ్ ప్రారంభిస్తారని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వార్ 2 సినిమాను ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: