టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతూ ఉండడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్లు జరుగుతుంటాయి. దానితో ఆ తర్వాత అంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవాలి అంటే , దాని దరిదాపుల్లోకి రావాలి అన్నా కూడా మిగతా స్టార్ హీరోలకు కూడా చాలా సమయం పడుతుంది అనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులు దాదాపు 100 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. ఇకపోతే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో 100 కోట్లకు మించిన షేర్ కలెక్షన్లను నైజాం ఏరియాలో వసూలు చేసి నైజాం ఏరియాలో ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే పుష్ప పార్ట్  1 మూవీ అద్భుతమైన విజయం సాధించడం , పుష్ప పార్ట్ 2 మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో పుష్ప పార్ట్ 2 మూవీ కి 100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ నైజాం ఏరియాలో జరిగింది అని , మరో సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం కాస్త కష్టం అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరిచారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి ఏకంగా నైజాం ఏరియాలో 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఇప్పటికే ఈ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా నైజాం ఏరియాలో ఓజి మూవీ ఆల్మోస్ట్ దరిదాపుల్లోకి మొదటి భాగమే రావడం విశేషం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk