ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడ
డిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమిక్ చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు యానిమల్ అనే సినిమాను రూపొందించి దానితో కూడా బ్లాక్ బస్టర్ విజెన్ని సొంతం చేసుకున్నాడు. 

ఇలా ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇకపోతే సందీప్ తన తదుపరి మూవీ ని ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే టైటిల్ తో చేయబోతున్నాడు. మొదట ఈ మూవీలో దీపికా పదుకొనే ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపిక ను హీరోయిన్గా కాకుండా తృప్తి డిమ్రి ని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఇక స్పిరిట్ మూవీ లో తనను హీరోయిన్గా వద్దు అని వేరే బ్యూటీ ని హీరోయిన్గా ఎంపిక చేసుకోవడం గురించి దీపికా కూడా కాస్త ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపిక కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. 

మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీలోని పాత్ర ద్వారా దీపిక కి మంచి గుర్తింపు వచ్చింది. ఇలా సందీప్ "స్పిరిట్" మూవీ నుండి ఈ బ్యూటీ ని తప్పించడంతో ఈమె కల్కి 2898 AD పార్ట్ 2 లో కూడా నటించడానికి ఇష్టపడడం లేదు అని ఓ వార్త వైరల్ అయింది. కానీ ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: