మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప`. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ పౌరాణిక చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ ను పోషించగా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు కన్నప్పలో భాగమయ్యారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్ల‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.


ఫైన‌ల్ కాపీ కూడా రెడీ అయింది. తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో మంచు మోహన్ బాబు, విష్ణు ఫైన‌ల్ కాపీని వీక్షించి సంతృప్తి చెందిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా క‌న్న‌ప్ప ర‌న్‌టైమ్ కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సినిమా ర‌న్ టైమ్ మూడు గంట‌ల‌కు పైగా ఉంటుంది అన్న‌దే ఆ వార్త సారాంశం.


అయితే సినిమా విజ‌యంలో ర‌న్‌టైమ్ కూడా ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తుంది. ర‌న్‌టైమ్ ఎంత క్రిస్పీగా ఉంటే అంత సేఫ్‌. కానీ క‌న్న‌ప్ప సినిమా నిడివి మూడు గంట‌ల‌కు పైగా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఒక‌వేళ నిజ‌మైతే మాత్రం ప్ర‌స్తుత రోజుల్లో ఒక మైథలాజికల్ మూవీకి ఏకంగా అన్ని గంట‌ల ర‌న్‌టైమ్ అంటే ఎంత వరకు వర్కవుట్ అవుతుంది? ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా? ఓపిగ్గా థియేట‌ర్స్ లో కూర్చోగ‌ల‌రా? అన్న ప్ర‌శ్న‌లు క‌చ్చితంగా త‌లెత్తుతాయి. మ‌రి ర‌న్‌టైమ్ విష‌యంలో మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: