సినిమా ఫలితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండవు .. కొన్నిసార్లు బాగా తీసిన అవి బాక్స్ ఆఫీస్ దగ్గర డిలాస్టర్ గా మిగులుతాయి .. కానీ ప్రేక్షకులు వాటిని గుర్తించి ఎంతగానో గౌరవిస్తారు .. అందుకు ఎగ్జాంపుల్ ఖలేజానే చెప్పుకోవచ్చు .. కానీ రొటీన్ సినిమాలతో వస్తే మాత్రం ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఒకప్పుడు ఇండస్ట్రీ ని షేక్‌ చేసే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన గొప్ప దర్శకులు ఇప్పుడు తమ సినిమాలతో షో మధ్యలోనే లేచి వెళ్లిపోయే స్థాయికి దిగజారిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి .. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగటివ్ టాక్ వచ్చేసింది  ... కనీసం పరవాలేదని చెప్పే ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించడం లేదు .


కేవలం కాంబినేషన్ క్రేజీ మీద బిజినెస్ చేసి .. లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా దియేటర్ లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన తలనొప్పి అంత ఇంతా కాదు .. దళపతి , నాయకుడు , రోజా , బొంబాయి వంటి సినిమాలు తీసింది ఈ దర్శకుడైన అని ఎవరికైనా సందేహం రాకుండా ఉండదు .. భారతీయుడు , జెంటిల్మెన్ , ఒకే ఒక్కడు , ప్రేమికుడు లాంటి గొప్ప సినిమాలు ఇచ్చిన ఇండియన్  స్పిల్ బర్గ్ శంకర్ వరుసగా ఇండియన్ 2 , గేమ్ చేంజర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందు మర్చిపోలేని డిజాస్టర్లు ఇచ్చారు .. పాటలకు , ఫైట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టించిన దానికి తగ్గ అవుట్ పుట్ సగం కూడా రాబట్టుకోలేకపోతున్నారు .



అలాగే మురుగదాస్ ది కూడా ఇదే కథ .. గజిని , తుపాకీ లాంటి గొప్ప సినిమాలు ఇచ్చిన  ఇతనేనా సల్మాన్ తో సికందర్ తీసింది అని అనుకోని వాళ్ళు లేరు. అంతకుముందు రజినీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చిన‌ దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడైనా చివరి ఆశ శివ కార్తికేయన్ మదరాసినే .. ఇలా కోలీవుడ్లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి గొప్ప దర్శకులు ఇంత  ఇలా కింద స్థాయికి దిగజారి పోవడం ఏంటని ఫాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు .. అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ఇతర ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ఇలాంటి  ట్రోలింగ్ కి గురికావడం కొంత బాధాకరం .. వీరు కంబ్యాక్ ఇవ్వటం అనేది వీరి చేతిలోనే ఉంది .. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ దర్శకులు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం .

మరింత సమాచారం తెలుసుకోండి: