అక్కినేని ఫ్యామిలీ లో అఖిల్ జైనబ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాగార్జున ఇంట్లో సింపుల్ గా ఈ పెళ్లి వేడుక జరిగినప్పటికీ రేపు అన్నపూర్ణ స్టూడియో లో చాలా గ్రాండ్ గా అఖిల్ జైనబబ్ రావడ్జిల రిసెప్షన్ పార్టీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిసెప్షన్ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.. అయితే అక్కినేని ఫ్యామిలీ లో శుభకార్యం జరిగి అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో నాగచైతన్య కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది సమంత.మరి ఇంతకీ నాగ చైతన్యకి సమంత ఇచ్చిన ఆ షాక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

 నాగచైతన్య సమంత  ప్రేమించి పెళ్లి చేసుకున్నాక సమంత తన భర్త పై ప్రేమకి గుర్తుగా ఎన్నో టాటూలు వేయించుకుంది.ముఖ్యంగా సమంత నాగచైతన్య ఇద్దరు కలిసింది ఏమాయ చేసావే సినిమా ద్వారా కాబట్టి ఈ సినిమాకి సంబంధించి YMC( ఏ మాయ చేసావే సినిమా) అనే టాటూ ని తన మెడ కింద వీపు మధ్యభాగంలో వేయించుకుంది. అయితే తాజాగా ఈ టాటూ ను  సమంత తొలగించుకున్నట్టు కనిపిస్తుంది.సమంత తాజాగా ఒక యాడ్ షూట్ లో కనిపించింది.అయితే ఈ యాడ్ షూట్ లో సమంత ఒంటిమీద వైఎంసి అనే టాటూ కనిపించలేదు.

దీంతో సమంత నాగ చైతన్య గుర్తుగా ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపి వేసుకుంది అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సమంత నాగచైతన్యకి సంబంధించిన ఎన్నో టాటూ లను తన బాడీ నుండి చెరిపి వేసుకుంది. తాజాగా ఉన్న వైఎంసి అనే ఏమాయ చేసావే సినిమాకు సంబంధించి టాటూ కూడా చెరిపి వేసుకోవడంతో నాగచైతన్యను పూర్తిగా తన మైండ్ నుండి తన బాడీ నుండి రిమూవ్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: