
ఇక నిజంగా అఖండ 2 , ఓజి ఒకేసారి తలబడితే ఒక్కొ సెంటర్లో ఒక్కోలా ఒకరి మీద మరొకరి ప్రభావం కచ్చితంగా ఉంటుంది .. బీసీ సెంటర్స్ లో బాలయ్య డామినేషన్ ఉండొచ్చు , అలాగే నైజాం లాంటి ఏరియాల్లో పవన్ యుఫోరియా గట్టిగా ఉంటుంది అలాగే చిన్న కేంద్రాల్లో రెండు మూడు స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిలో షోలు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా తయారవుతుంది .. సంక్రాంతికి మేనేజ్ చేయడం వేరు కానీ దసరాకి సీన్ మరోలా ఉంటుంది .. 14 రీల్స్ , డివివి ఎంటర్టైన్మెంట్స్ వరస చూస్తుంటే ఈ విషయంలో ఎవరూ తగ్గేలా కనిపించడం లేదని కూడా తెలుస్తుంది .. ఇక మరి ఈ రోజు సాయంత్రం అఖండ 2 పై ఓ క్లారిటీ రానుంది .
ఒకవేళ కాంపిటీషన్ అనివార్యమైతే మాత్రం ఈ సీన్ చూడటానికి ఎంతో రసవత్తరంగా మారుతుంది .. రాజకీయంగా కూడా కూటమి డిప్యూటీ సీఎం వర్సెస్ కూటమి ఎమ్మెల్యే ఇద్దరూ పోటీ పడాల్సి ఉంటుంది .. ఇదే క్రమంలో కింది స్థాయిలో ఈ దిశగా నిర్ణయం జరుగుతుందని విషయం పవన్ కళ్యాణ్ బాలయ్య కు తెలుసో లేదోననే అనుమానాలు కూడా వస్తున్నాయి .. అఖండ 2 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. జార్జియా షెడ్యూల్ తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తి అయినట్లే .. ఓజీలో ఇప్పటికే తన భాగం షూటింగ్ను పవన్ పూర్తి చేశాడు .. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి బోయపాటి శ్రీను సుజిత్‌లు వేగంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు .. ఇక మరి సెప్టెంబర్ 25 న అఖండ 2 వర్సెస్ ఓజి ఉంటుందా లేక ఈ రెండిటిలో ఒక సినిమానే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి .