ఫీల్ గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఈసారి రూటు మార్చి డబ్బు, వ్యవస్థ, అవినీతి చుట్టూ కేంద్రీకృతమైన కథాంశంతో `కుబేర‌` అనే మూవీని తెర‌కెక్కించారు. ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల‌ను పోషించారు. జిమ్ సర్భ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో అల‌రించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన కుబేర మూవీ జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


ఇప్ప‌టికే ఈ మూవీ నుండి బ‌ట‌య‌కు వ‌చ్చిన సాంగ్స్‌, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాత్రం కుబేర టీమ్ అంత యాక్టివ్ గా లేదు. అందువ‌ల్ల సినిమాపై అంచ‌నాలు డీసెంట్ స్థాయిలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రొడ్యూస‌ర్ సునీల్ నారంగ్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి ఆయ‌న ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. అలాగే కుబేర‌లో నాగ్ క్యారెక్ట‌ర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవ‌రో కూడా సునీల్ నారంగ్ రివీల్ చేశారు.


నిజానికి కుబేర‌లో మెయిన్ హీరో ధ‌నుషే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పాత్ర‌కు ఏమాత్రం తీసిపోని క్యారెక్ట‌ర్‌లో నాగార్జున న‌టించారు. ఇదొక మ‌ల్టీస్టార‌ర్‌గానే చెప్పుకోవ‌చ్చు. అయితే నాగ్ క‌న్నా ముందు నిర్మాత‌లు విజ‌య్ సేతుప‌తి, విక్ట‌రీ వెంక‌టేష్‌ల‌ను సంప్ర‌దించాల‌ని భావించార‌ట. కానీ అందుకు శేఖ‌ర్ క‌మ్ముల అంగీక‌రించ‌లేదు. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ పాత్ర‌కు నాగార్జున‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేక‌పోయారు శేఖ‌ర్ క‌మ్ముల. నాగార్జునే కావాల‌ని ఆయ‌న ప‌ట్టుప‌ట్ట‌డంతో.. నిర్మాత‌లు సైతం అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. తాజాగా ఈ విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్ సునీల్ నారంగ్ బ‌య‌ట‌పెట్టారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: