సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేటివి సర్వ సాధారణమైన విషయమే.  హిట్ లేని హీరో హీరోయిన్ అయినా మనం చూసుకుంటామేమో కానీ రూమర్ రాని హీరో హీరోయిన్ ని అస్సలు చూసుండము.  అది చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు స్టార్ సెలబ్రెటీ కాదు స్టార్ ప్రొడ్యూసర్ కాదు .. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది . హైలెట్ ఏంటంటే అలా రూమర్ వినిపిస్తేనే వాళ్ళు ఇండస్ట్రీలో తోపైనా సెలబ్రిటీలుగా మారుతారు అనడానికి నిదర్శనం అని అంటుంటారు కొంతమంది జనాలు .

మరీ ముఖ్యంగా కొన్ని రూమర్స్ మన మనసును బాగా హర్ట్ చేస్తాయి . అది ఫేక్ తప్పు అని తెలిసిన కూడా కొంతమంది పదే పదే అలాంటి కామెంట్స్ తో వాళ్లని బాధపెడుతూ ఉంటారు . అలా బాధపడిన వాళ్లలో హీరోయిన్ అనుష్క కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎమోషనల్ అవ్వని అనుష్క ఆ రూమర్స్ కి బాధ పడిపోయింది.. కన్నీళ్లు పెట్టుకుందట.  ఇండస్ట్రీలోకి "సూపర్" అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ "జేజమ్మగా" పాపులర్ రెడ్డి సంపాదించుకుంది.

త్వరలోనే "ఘాటీ" అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది అనుష్క . అయితే అలాంటి అనుష్క కెరియర్ లో ఎన్నో రూమర్స్ ఎదుర్కొంది . కానీ ఒకే ఒక్క రూమర్ ఆమె అభిమానులను ..ఆమెను మన కుటుంబాన్ని తీవ్రంగా బాధ పెట్టింది . ఒక స్టార్ సీనియర్ హీరోతో అనుష్క ప్రేమాయణం  కొనసాగిస్తుంది అని .. ఆల్రెడీ ఆ స్టార్ హీరోకి పెళ్లి అయ్యే కొడుకు కూడా  ఉన్నా..ఆమె ఆ హీరోతో బాగా మింగిల్ అవుతూ వచ్చింది అంటూ పరమ చెత్త రూమర్ ఒకటి వైరల్ అయ్యింది.

దానిపై చాలామంది బోల్డ్ గా కూడా కామెంట్స్ చేశారు.  అలాంటి ఒక రూమర్ విని ఇండస్ట్రీలో కి వచ్చిన కొత్తలో అనుష్క బాధ పడిపోయిందట.  ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా..? అంటూ ఏడ్చేసిందట . ఆ తర్వాత రాను రాను ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ రూమర్స్ ని పట్టించుకోవడమే మానేసిందట అనుష్క . ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్న సరే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదేలా అన్న రేంజ్ లో ముందుకు వెళ్ళిపోతుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి: