
హీరోయిన్ జెనీలియా రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో బొమ్మరిల్లు సినిమాలో హాసిని అంటే ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా ప్రేమించారు. ఆ పాత్రతో ఆమె తెలుగు సినీ ప్రేక్షకుల హృదయంలోకి అంతగా చొచ్చుకుపోయింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ్ తనయుడు బాలీవుడ్ హీరో రితీష్ దేశముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాక ఆమె ఓ పాపకు జన్మనిచ్చి వైవాహిక జీవితంలో స్థిరపడిపోయింది. అయితే పెళ్లయి ఓ పాపకు జన్మనిచ్చిన అలియాభట్ - దీపిక పదుకొనే లాంటి వాళ్ళు అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక కత్రినా కైఫ్ - కీయారా అద్వాని సంగతి తెలిసిందే. ఇలా పెళ్లయిన వీళ్లంతా సినిమాల్లో రాణిస్తుంటే జెనీలియా మాత్రం దీనికి రివర్స్‌లో స్పందించింది.
పెళ్లయింది కాబట్టే తనను సినిమాలలోకి తీసుకోవటం లేదని బాధపడుతోంది. పెళ్లయి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లో నటించడానికి తన ప్రయత్నించిన ఎవరు అవకాశాలు ఇవ్వలేదని ఆపోయింది. చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ తో కలిసి సినిమా చేసింది ఈ మాజీ హీరోయిన్. అమీర్ కూడా అతను ఊరికే తీసుకోలేదని ... మూడుసార్లు అడిషన్ చేశాడని అంటుంది. తన పాత్ర పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే తనకు ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. ఇతర మేకర్స్ కూడా తనను అడిషన్స్‌కు పిలవాలని ... నచ్చితేనే ఆఫర్లు ఇవ్వాలని జెనీలియా కోరుతోంది. దక్షిణాదిన కూడా తనకు చాలామంది స్నేహితులు ఉన్నా .. ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని కాస్త ఆవేదనతో చెబుతోంది జెనీలియా.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు