తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న కల్పిక గణేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం ఏదో ఒక వివాదాస్పదంగా మారుతూనే ఉంది ఈ అమ్మడు. ఇప్పటికే ఈమె పబ్బులో జరిగిన గొడవ వల్ల కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొక కేసు కల్పిక పైన నమోదైనట్లుగా  తెలుస్తోంది. మరి ఏం జరిగింది? నటి కల్పిక గణేష్ పైన ఎవరు కేసు పెట్టారని విషయం చూద్దాం .


తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నటి కల్పిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలాలను ఉపయోగించి.. కీర్తన అనే ఒక బాధితురాలు పైన ఈమె దూషించి మాట్లాడినట్లుగా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందట.. ఇన్ బాక్స్ మెసేజ్ లు స్టేటస్ లు పెట్టి మరి స్క్రీన్ షాట్లను తీసి పోలీసులకు ఆధారాలుగా పంపించినట్లు ఆ బాధితురాలు తెలియజేస్తోంది.. ఈమె పైన కేసు నమోదు అయిన..67ITA 2000- 2008,79,356 BNS ప్రకారం ఈమె పైన కేసు నమోదు చేసినట్లుగా సమాచారం.దీంతో ఒక్కసారిగా ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి కల్పిక ఇంతలా దిగజారిపోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం వైరల్ గా మారడంతో ఈ కేసు పైన కల్పిక బయటికి రావడం కూడా కష్టమే అంటూ పరువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


గత నెల 29వ తేదీన కల్పిక తన బర్తడే సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులో పార్టీ ఇచ్చింది. బర్తడే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో కలిసి గొడవ పడింది కల్పిక. ఈ విషయం పైన పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈమె పైన కేసు నమోదు అయ్యింది. రోజురోజుకి కల్పిక పైన కేసులు ఎక్కువ అవుతున్నాయనే విధంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయాల పైన కల్పిక ఎలా స్పందిస్తుందో చూడాలి. కల్పిక నటించిన సినిమాల విషయానికి వస్తే SVSC, యశోద, జులాయి, హిట్ 1, నమో వెంకటేశ తదితర చిత్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: