
చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై ఈ ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చారు . ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ - అల్లు అర్జున్ స్టెజీకి ముందు వరుసలో కూర్చుని ఏదో సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తమన్ స్టేజ్ పై స్పెషల్ ప్రోగ్రాం ఇస్తూ పలు సినిమాలలోని సాంగ్స్ పాడి అలరించారు . దీంతో తమన్ పాటలు పాడేటప్పుడు .. బాలకృష్ణ ..అల్లు అర్జున్ ని చూపిస్తూ అల్లు అర్జున్ వెళ్లి స్టేజిపై స్టెప్పులు వెయ్ వెళ్ళు అంటూ సరదాగా ఆట పట్టిస్తున్న ఓ వీడియో వైరల్ అవుతుంది.
నిన్న గద్దర్ అవార్డ్స్ వేడుకలో బన్నీతో బాలయ్య చేసిన హడావిడి మామూలుగా లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . "అల్లు అర్జున్ అమ్మో వద్దు అంటూ అనడం.. బాలయ్య కమాన్ వెళ్ళు వెళ్ళు అనడం .. సరదాగా మాట్లాడుకోవడం..వీడియో రికార్డ్ అవ్వడంతో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ - బాలయ్య ఫ్యాన్స్ ఈ క్యూట్ వీడియోని వైరల్ చేస్తున్నారు . మరెందుకు ఆలస్యం ఆ స్పెషల్ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..!!