
ఈ సినిమాలో దాదాపు 5 మంది హీరోయిన్స్ ఉండబోతున్నారు అన్న న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు బన్నీ డ్యూయెల్ షేడ్శ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారట . మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సినిమా నే మలుపు తిప్పబోతుంది అని ఇప్పటివరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ లో బన్నీ నటించనే నటించలేదు అంటూ టాక్ వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా బన్నీ కి రెండు పాత్ర లుక్ ను డిఫరెంట్ గా డిజైన్ చేశారట. కాగా మొదటి హాఫ్ లో మొత్తం బన్నీ చాలా యంగ్ లుక్స్ లో కనిపించగా సెకండ్ హాఫ్ లో మాత్రం బన్నీ టోటల్గాఓల్డ్ లుక్స్ లో కనిపిస్తారట . దీనికోసం బన్నీ బరువు కూడా పెరగాలట.
ఫస్ట్ హాఫ్ లో బరువు తగ్గిన బన్నీ సెకండ్ హాఫ్ లో బరువు పెరిగిన బన్నీని చూపించబోతున్నారట . ఇది నిజంగా చాలా చాలా టఫ్ జాబ్. ఒకే సినిమా కోసం బరువు తగ్గాలి బరువు పెరగాలి. అది కూడా తక్కువ టైంలో . మరి బన్నీ ఇలాంటి సాహసాన్ని ఎందుకు ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ అట్లీ భలే రాసాడు అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు . మాఫియా బ్యాక్ డ్రాప్ లో డాన్ చుట్టూ ఈ కథ నేపథ్యం సాగుతుందట . డాన్ గా మనం అల్లు అర్జున్ చూడబోతున్నాం . డాన్ గా అల్లు అర్జున్ చాలా చాలా రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నారట. స్టైలిష్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న అల్లు అర్జున్ ని ఇలా చూపించడం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే . త్వరలోనే ఈ సినిమాలో నటించబోతున్న మిగిలిన నటీనటుల గురించి అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటున్నారు మేకర్స్..!!