తమిళ నటుడు ధనుష్ తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 6.67 మిలియన్ వ్యూస్ ... 100 కే లైక్స్ లభించాయి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , ధనుష్మూవీ లో హీరో గా నటించడం , నాగార్జునమూవీ లో కీలకమైన పాత్రలో నటించడం , ఈ మూవీ కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం , దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ మూవీ ట్రైలర్ కి సూపర్ సాలిడ్ వ్యూస్ , లైక్స్ దక్కుతాయి అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

కానీ ఈ మూవీ ట్రైలర్ కి ఆ స్థాయి వ్యూస్ , లైక్స్ రాలేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి కుబేర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: