ఈ రీసెంట్ టైమ్స్ లో పిరియాడికల్ కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది .. మళ్లీ పీరియడ్ అంటే వందేళ్లు వెనక్కి వెళ్ళటం కాదు .. ఏకంగా వందలు ఏళ్లు వెనక్కి తీసుకు వెళుతున్నారు మన దర్శకులు .. హీరోలను ఒప్పించి రియల్ హీరోల చరిత్రలను బయటికి తీసుకువస్తున్నారు .. ఇప్పుడు తాజాగా అలాంటి హిస్టారికల్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు చాలానే రాబోతున్నాయి .. ఇక మరి అవి ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం .. పిరియాడికల్ సినిమాలపై మన దర్శకుల చూపులు వెళుతున్నాయి ప్రధానంగా ఒకప్పటి మన చరిత్రను బయటికి తీసుకువస్తున్నారు . ఇప్పటికే తన 100వ‌ సినిమా కోసం 1వ శతాబ్ధపు గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీని ఎంచుకున్నారు బాలయ్య .


అలాగే ఇప్పుడు తాజాగా మరో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు సంకల్ప రెడ్డి తెరకెక్కిస్తున్న మూవీ కూడా 7వ సెంచరీ రాజుది .. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ బయటికి వచ్చింది .. 7వ శతాబ్దపు చరిత్ర మరిచిన రాజు కథను తీసుకురాబోతున్నట్టు చెప్పుకొచ్చారు సంకల్ప రెడ్డి .  అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా 16వ శతాబ్దపు కథ తో రానుంది .. అప్పటి ఔరంగాజేబు  పాత్ర కూడా ఇందులో ఉండనుంది .  అలాగే కోహినూర్ వజ్రం చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది .. ఒరిజినల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న  ఫిక్షనల్ స్టోరీ వీరమల్లు .. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల‌ ముందుకు రానుంది . ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి పీరియడ్ స్టోరీ తో త్వరలోనే రాబోతున్నాడు ..


రాహుల్ సంక్రీత్యన్... తెరకెక్కించబోయే సినిమాలో 18వ సెంచరీ నేపథ్యం స్టోరీ ఉండబోతుంది .. 1854 నుంచి 1878 మధ్య జరిగిన ఓ మహాయోధుడు స్టోరీ ఇది .. అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు .. అలాగే మరో యంగ్ హీరో నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా పిరియాడికల్ స్టోరీలు వైఫై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ఈయన నటిస్తున్న ది ఇండియా హౌజ్ 19వ శతాబ్దపు స్టోరీ .. 1900 సమయంలో జరిగే నేపథ్యం ఇది .  అలాగే స్వయంభు కూడా పీరియాడికల్ స్టోరీ నే .. 18వ శతాబ్దపు ఒడిశా యోధుడి స్టోరీ తో ఈ సినిమా రాబోతుంది .. ఇలా మొత్తానికి మన హీరోలు కథల కోసం మన చరిత్ర పుటలను దాటేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: