
టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ కలయిక లో సెన్సిటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. మోస్ట్ అవైటెడ్ సినిమా గా తెరకెక్కిన కుబేర ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోన్న వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇండియన్ భాషల్లో యూఎస్ మార్కెట్లో కూడా గ్రాండ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఈ కంటెంట్ పై లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా తెలుగు , తమిళ్ కంటెంట్ మాత్రమే అక్కడ ముందు అందిందంటున్నారు. దీంతో 19 నుంచే అక్కడ ప్రీమియర్లు వేయాలని ముందుగా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసుకున్నారు. అయితే హిందీ కంటెంట్ మాత్రం ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది. దీంతో కుబేర హిందీ ప్రీమియర్లు మాత్రం అక్కడ ఉండవని తెలుస్తోంది. సో అక్కడ కుబేర హిందీ వెర్షన్ మాత్రం సినిమా రిలీజ్ రోజు నుంచే డైరెక్టుగా షోలు వేస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి అలాగే అమిగోస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు