రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో స్పిరిట్ అనే సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మొదట ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే ను హీరోయిన్గా అనుకున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా సెట్ అయింది అనే లోపే ఈమె ఈ సినిమాలో హీరోయిన్గా నటించాలి అంటే అనేక కండిషన్స్ పెట్టినట్లు , దానితో సందీప్ ఆ కండిషన్స్ కి ఒప్పుకోనట్లు దాని ద్వారా ఈ సినిమా నుండి దీపికా తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇక దీపిక పడుకొనే స్థానంలో ఈ మూవీ లో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించిన తృప్తి డిమ్రి , సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఓకే చేశాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం సందీప్ "స్పిరిట్" మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో మరో నటుడిని సందీప్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన ఉపేంద్ర లీమయో తాజాగా సందీప్ ని కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన స్పిరిట్ మూవీలో ఓ ముఖ్యమైన పాత్రలో ఎంపిక అయ్యాడు.

అందుకే సందీప్ ను ప్రత్యేకంగా కలిశాడు అని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే యానిమల్ మూవీలో ఈయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఆ తర్వాత కొన్ని సినిమాలలో కూడా ఈయన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకున్నాడు. దానితో స్పిరిట్ మూవీ లో కూడా ఈయన కనిపించబోతున్నాడు అని వార్తలు రావడంతో ఈ సినిమాలో కూడా అద్భుతమైన కామెడీ ఉంటుంది అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: