పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీలకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూడు మూవీల షూటింగ్లను ప్రారంభించి కొంత బాగం షూటింగ్లు పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయ పనులతో ఫుల్ బిజీ అయ్యాడు. దానితో ఈ మూడు మూవీల పనులను పక్కన పెట్టి పవన్ రాజకీయాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇక రాజకీయాలలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.

పవన్ కొత్త సినిమాలకు ఓకే చెప్పకపోయినా ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను మాత్రం పూర్తి చేయడంలో అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ను పూర్తి చేశాడు. ఓ వైపు ఓజి మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీల షూటింగ్లలో కూడా పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓజి మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఓజి సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 2025 సెప్టెంబర్ 25 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను తమిళ నటుడు శింబు పాడినట్లు తెలుస్తోంది.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమన్మూవీ గ్లిమ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దానితో ఈ మూవీ పాటలకు ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడో అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీలోని మొదటి సాంగ్ ను శింబు పాడడం , తమన్మూవీ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతూ ఉండడంతో ఈ మూవీ ఫస్ట్ సాంగ్ చాట్ బాస్టర్ గా నిలుస్తుంది అని అనేక మంది పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: