అక్కినేని హీరోలకు ప్రస్తుతం గుడ్ టైమ్‌ నడుస్తోంది. ఓవైపు ఇంట శుభకార్యాలు, మరోవైపు సినిమాలపరంగా సక్సెస్ లు పలకరిస్తుండడంతో అక్కినేని హీరోలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం అక్కినేని ఫ్యాన్స్ శోభిత ధూళిపాళ్లకే ఇచ్చేస్తున్నారు. గ‌త‌ ఏడాది డిసెంబర్ లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంట‌ కోడలుగా శోభిత అడుగు పెట్టింది. ఆ వెంటనే నాగచైతన్య `తండేల్` మూవీతో బిగ్ హిట్ అందుకున్నాడు. కెరీర్ లోనే తొలిసారి ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.


ఆ తర్వాత అక్కినేని అఖిల్ పెళ్లి పీటలెక్కాడు. తన ప్రేయసి జైనాబ్ తో ఏడడుగులు వేసి ఓ ఇంటివాడు అయ్యాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న కింగ్ నాగార్జున తాజాగా `కుబేర` మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు‌. ఈ చిత్రంలో నాగార్జున నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కుబేర బాక్సాఫీస్ వద్ద వసూల్ వర్షం కురిపిస్తుంది.


అదేవిధంగా అఖిల్ త్వరలో `లెనిన్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. లెనిన్ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. మొత్తంగా అక్కినేని హీరోలు ఫుల్ స్వింగ్‌లో  దూసుకుపోతున్నారు. ఇందుకు కార‌ణం కోడలుగా శోభిత అడుగుపెట్టడమే.. ఆమె వ‌స్తూ వ‌స్తూ అక్కినేని ఫ్యామిలీకి అదృష్టాన్ని కూడా తీసుకొచ్చింద‌ని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: