ఒక సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే అది దర్శకుడే. సినిమాకు పునాది ప‌డే దర్శకుడు ఆలోచన, ఊహల నుంచే. సినిమా ఫలితంలో కథానాయకుడి పాత్ర ఎంత ఉంటుందో దర్శకుడు పాత్ర కూడా అంతే ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏదో ఒక కార‌ణంతో సినిమా మ‌ధ్య‌లోనే దర్శకులు తప్పకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వేరే వ్యక్తులు ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు.


రీసెంట్ టైమ్‌లో పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను స్టార్ట్ చేసింది క్రిష్‌ జాగర్లమూడి కాగా.. ముగించింది జ్యోతి కృష్ణ. అయితే నిర్మాతలు దర్శకులుగా ఇద్దరు పేర్లను వేస్తున్నారు. కానీ అసలు దర్శకుడు పేరే లేకుండా తెలుగులో విడుదలైన ఏకైక సినిమా ఏదో తెలుసా `శుభకార్యం`.
2001లో విడుద‌లైన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్‌, వడ్డే నవీన్ హీరోలుగా న‌టించారు. మాళవిక, ఆశా సైనీ హీరోయిన్లు కాగా.. క‌ళ్యాణి ఈ మూవీకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. త‌మిళ డైరెక్ట‌ర్‌ ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో శుభ‌కార్యం సినిమా స్టార్ట్ అయింది. కానీ చిత్రీకరణ స‌మ‌యంలో హీరో రాజ‌శేఖ‌ర్ తో క్లాషెస్ కార‌ణంగా సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గానే ర‌విరాజా పినిశెట్టి త‌ప్పుకున్నారు. దాంతో `బొబ్బిలి వంశం` ఫేమ్ అదియ‌మాన్ మిగ‌తా భాగం షూటింగ్ ను పూర్తి చేవారు.


అయితే మూవీ కంప్లీట్ అయ్యాక డైరెక్ట‌ర్ గా త‌న పేరే వేయాలంటూ ర‌విరాజా పినిశెట్టి ప‌ట్ట‌బ‌ట్టారు. సినీ పెద్ద‌ల‌కు ఆయ‌న కంప్లైంట్ కూడా చేయ‌డంతో అప్ప‌ట్లో ఈ ఇష్యూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దాంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన నిర్మాత అస్స‌లు ద‌ర్శ‌కుడి పేరే లేకుండా శుభ‌కార్యం మూవీని రిలీజ్ చేశారు. ఇటు ర‌విరాజా పినిశెట్టి, ఇటు అదియ‌మాన్ ఇద్ద‌రికీ క్రెడిట్ ద‌క్క‌కుండా చేశారు. ఇక డైరెక్ట‌ర్ పేరు లేకుండా విడుదలైన‌ శుభ‌కార్యం పెద్ద‌గా ఆడ‌లేదు. ఈ సినిమా, బాల‌కృష్ణ బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ `న‌ర‌సింహా నాయుడు` సేమ్ టు సేమ్ ఒకేలా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు శుభ‌కార్యం వొంక కూడా చూడ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: