ఇతర ఇండస్ట్రీలలో పోల్చి చుస్తే సక్సెస్ రేట్ అతి తక్కువగా ఉన్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనే సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో పారితోషికాలను పెంచిన స్థాయిలో తగ్గించడానికి అస్సలు ఇష్టపడరు. ఒక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో పారితోషికం గత ఐదేళ్ళలో నాలుగు రేట్లు పెరగగా మరో స్టార్ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్నా ఆయన రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల స్థాయిలో ఉంది.

అసలు టాలీవుడ్ హీరోలు ఏ ప్రాతిపదికన రెమ్యునరేషన్ పెంచుతున్నారో  కూడా క్లారిటీ లేదు. ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అయితే అందులో 200 కోట్ల రూపాయలు  అందరి రెమ్యునరేషన్లకే సరిపోతున్నాయి. మిగతా 100 కోట్లతో సినిమాను ఎంత అద్భుతంగా తీసినా  తెరపై  100 కోట్ల బడ్జెట్ వాల్యూ చూసి  ప్రేక్షకులు షాకవుతున్నారు. చెప్పే బడ్జెట్ కు, సినిమా క్వాలిటీకి అస్సలు పొంతన ఉండటం లేదు.

ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాను చూపించి  ప్రతి సినిమాకు అదే స్థాయిలో  పారితోషికం తీసుకోవడం ఏంటనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.  ఏ కారణం వల్ల అయినా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం  నిర్మాతలు ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది.  గేమ్ చెంజర్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో  నిర్మాత దిల్ రాజుకు  భారీ స్థాయిలో నష్టాలూ వాటిల్లిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు సైతం  తమ్ముడు సినిమాకు హీరో నితిన్ కు  సాధారణం కంటే  తక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చారు.  టాలీవుడ్  ఇండస్ట్రీలో మిగతా హీరోల పరిస్థితి సైతం ఇదేనని  రాబోయే రోజుల్లో   పారితోషికం  తగ్గించకపోతే ఇండస్ట్రీకి ప్రమాదమని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ పరిస్థితి సైతం  ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. దిల్ రాజు  భవిష్యత్తు సినిమాల ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: