- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

శ్రీలీల  టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది .  అయితే ఈ మధ్య ఈమె ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది .. అక్కినేని హీరో అఖిల్ లెనిన్ సినిమా నుంచి ఈమె బయటికి వచ్చేసింది .. అంత సెట్ అనుకున్న ఈ సినిమా నుంచి శ్రీలీలా బయటికి రావటం పై టాలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తుంది .. పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది .. ఈ సినిమా కోసం ఈమె పెద్ద మొత్తం లో తన డేట్స్ కూడా ఇచ్చిందట ..


పవన్ సినిమా కి డేట్స్ ఇచ్చిన తర్వాతే లెనిన్ సినిమా లోకి వచ్చింది .. ఇక ఇప్పుడు ఉస్తాద్ మూవీకి శ్రీలీలా కమిట్‌ అవడం తో రెండు సినిమాల కు డేట్స్ అడ్జస్ట్ కావటం లేదు .. ఇక దీంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే అది హీరోయిన్స్ కు గోల్డెన్ అవకాశం లాంటిది అలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు .. అందుకే శ్రీలీలా లెనిన్ సినిమా ను వదిలేసి పవన్ కళ్యాణ్ సినిమా కి మొగ్గు చూపిందని టాక్ .  ఇక ఇప్పుడు శ్రీలీల తప్పుకోవటం తో లెనిన్ టీం మరో కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ ని సినిమా లోకి తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: