
టాలీవుడ్ లో గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ మంచి డిమాండ్ ఏర్పడింది. థియేటర్ల ముందు భారీ క్యూ లైన్లు ... అరగంట ముందు థియేటర్ కి వెళ్ళటం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి విండో క్లోజ్ అయిపోవడం ఇవన్నీ చాలా మందికి చికాకు తెప్పించాయి. దీంతో ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు అంతా సులువు అయిపోయింది. షో టైం చూసుకోవటం టికెట్ అవైలబిలిటీ చూసుకోవటం.. రోజులు ముందుగానే టికెట్లు తీసుకోవడం అంతా అరచేతుల్లోకి వచ్చేసింది. సినిమా హిట్ టాక్ .. టికెట్ సేల్స్ ట్రెండ్ తెలుసుకోవాలంటే ఆన్లైన్ పోర్టల్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఆన్లైన్ టికెట్ పోర్టల్ అంతా గ్రీన్ ఉంటే సినిమా చెక్కేసినట్టే ..!
కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతుంది. కారణమేమిటంటే టిక్కెట్ బుకింగ్ యాప్ సర్వీస్ ఛార్జీలు అంటూ అదనంగా టికెట్ మీద భారీగా వసూలు చేస్తున్నారు. దాదాపు ఒక్కో టికెట్ మీద 25 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని థియేటర్తో కలిసి బుకింగ్ యాప్‌లు పంచుకుంటున్నాయి. ఈ డబ్బులు అటు యాప్‌లకు లాభాలు .. థియేటర్లకు అదనపు ఆదాయం పండిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. చాలా సినిమాలుకు ఓపెనింగ్ ఉండటం లేదు. మరీ ముఖ్యంగా మార్నింగ్ షాప్ పడిన తర్వాత టాక్ బాగుంటేనే జనం ధియేటర్ వైపు వస్తున్నారు. మరి పాన్ ఇండియా భారీ సినిమాలు మినహా .. చిన్న మిడిల్ రేంజ్ సినిమాలకు కౌంటర్ల దగ్గర టిక్కెట్లు దొరకవు అన్న భయం లేదు.
ఇప్పుడు ప్రతి చిన్న పెద్ద సినిమాకు 50 రూపాయలు అదనపు రేట్లు తెచ్చేయటం కామన్ అయిపోయింది. దీంతో యాప్ లు వసూలు చేసే ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన జనం ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా మళ్లీ కౌంటర్లలో టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల కొన్నాళ్లుగా టిక్కెట్ యాప్‌లు చూస్తే థియేటర్లో బుకింగ్ నీరసంగా కనిపిస్తోంది. కానీ షో పడే టైం కి ఫుల్ అవుతుంది. అంటే ఆఫ్లైన్ టికెట్ కొనుగోలు మళ్ళీ పెరుగుతోందని రెడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు