
అసలు ఏం జరిగిందంటే.. నిత్య మీనన్ తెలుగు అమ్మాయి కాదు. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో ఆమె జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ, మలయాళంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. హీరోయిన్ కావాలని, ఇండస్ట్రీలో స్థిరపడాలని నిత్య మీనన్ ఎప్పుడు కోరుకోలేదు. కానీ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి బలవంతం మీద `అలా మొదలైంది` సినిమాతో అనుకోకుండా నిత్య మీనన్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందాం తెలిసిందే.
ఈ మూవీ చేసే సమయానికి తెలుగు చిత్రాలు, ఇక్కడ నటీనటులపై నిత్య మీనన్ కు ఏమాత్రం అవగాహన లేదు. అలాంటి నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ప్రభాస్ ప్రస్తావన వచ్చింది. అయితే నిత్యా ఆయనెవరు తనకు తెలియదని సమాధానం ఇచ్చింది. అప్పటికే ప్రభాస్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి హీరో తెలియదని నిత్య మీనన్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ దెబ్బకు నిత్యా నరకం చూసిందట. నిత్యం ఏడుస్తూనే ఉండేదట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా తెలియజేసింది. ప్రభాస్ తెలియదని చెప్పినందుకు ఆయన ఫ్యాన్స్ తనను ట్రోల్ చేస్తూ మానసికంగా ఎంతగానో హింసించారని.. ప్రతి ఒక్క విషయంలో నిజాయితీగా ఉండకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాయని నిత్య మీనన్ చెప్పుకొచ్చింది.