
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత వరుస సినిమాలు వస్తున్నాయి. వీటిలో ముందుగా గత నాలుగేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. ఈ సినిమా తర్వాత రెండు నెలల గ్యాప్ లో పవన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ సినిమా కూడా వస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే యేడాది హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చాక ఒక్క సారి గా సినిమా పై హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి రానున్న సెన్షేషనల్ ప్రాజెక్ట్ ఓజీ.
దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా లో పవన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ సినిమా ఫస్టాఫ్ వరకు పవన్ చేశారట. అందులో కొన్ని మార్పులు కూడా పవన్ సూచించడంతో మేకర్స్ ఆ చిన్న చిన్న మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ... డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు ఏపీలోనూ .. ఇటు నైజాం లోనూ ఏరియాల వారీ గా జరుగుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్ అయితే సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు