తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ మాట్లాడిన మాటలు ఎంత హైలెట్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అప్పటివరకు దిల్ రాజు బ్రదర్ శిరీష్ అంటే ఒక నిర్మాతగా  డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే తెలిసిన జనాలకు శిరీష్  అంటే ఓ నిక్కాస్ అయిన డేర్ ఉన్న మనిషి అని అందరూ మాట్లాడుకునేలా చేసింది . ఉన్నది ఉన్నట్లు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాడు అన్న విషయం ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది . అయితే కొన్ని కారణాల చేత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్  శిరీష్ మాటలు వాళ్ళని హర్ట్ చేశాయి .


ఈ క్రమంలోనే వాళ్లకి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది శిరీష్ . దీంతో శిరీష్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అంటూ అందరూ ట్రోల్ చేశారు . కానీ శిరీష్ మాట్లాడిన పద్ధతికి మాత్రం అందరు ఫాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే  సినీ ఇండస్ట్రీలో కొత్త రూల్  సినీ మండలి తీసుకురాబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇకపై సినీ మేకర్స్ ఎవరైనా సినిమాకి సంబంధించి వర్క్ చేస్తున్న నటీనటులు లేదా టెక్నీషియన్స్.. డైరెక్టర్స్.. మేకర్స్.. ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సందర్భంలోనూ ఆ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడనే మాట్లాడకూడదు అంటూ ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నారట.



సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కోసం ఓ రేంజ్ లో పొగిడేసే మేకర్స్.. సినిమా ప్లాప్ అయ్యాక ఆ మేకర్స్ గురించి ఆ నటీనటుల గురించి ఏ విధంగా నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్ అని .. ఇండస్ట్రీలో స్నేహపూర్వక సంబంధాలు ముందుకు వెళ్తాయి అని సినీ మండలి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో మరొకసారి శిరీష్ పేరు ట్రెండ్ అవుతుంది. అంత శిరీష్  నోటి మాటల మహిమ కొత్త రూల్ తీసుకువచ్చేసింది  సినీ మండలి అంటూ మాట్లాడుకుంటున్నారు.  చూద్దాం మరి ఈ రూల్ నిజంగానే అప్లికేబుల్ అయ్యేలా ప్లాన్ చేస్తారో..?? లేక కేవలం వార్తలకు మాత్రమే పరిమితం చేస్తారో..???

మరింత సమాచారం తెలుసుకోండి: