- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. మొగలు సామ్రాజ్య కాలంనాటి హిస్టారికల్ ఎపిక్ సినిమాగా క్రిష్ - జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. ఈనెల 24న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ మేకర్స్ అందించారు. హరిహర వీరమల్లు సినిమాను తొలిరోజుకే చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఎప్పుడు టికెట్ల బుకింగ్ ఓపెన్ అవుతుందా ?అంటూ ఆసక్తితో ఉన్నారు.


వారి కోసం ఇప్పుడు సెన్సేషన్ న్యూస్ వచ్చేసింది. వీరమల్లు బాక్సాఫీస్ ఊచ‌కోత కోసం మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ జూలై 10 నుంచి ఓపెన్ కానున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీంతో వీరమల్లు దాడికి బాక్సాఫీస్ ను ముందు నుంచే రెడీ చేస్తున్నారని అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇక వీరమల్లు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూపంలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కటే ఉత్కంఠతో ఉన్నారు. ఏది ఏమైనా ఓవర్సీస్ లో వీరమల్లు ఊచకోత ముందుగానే ప్లాన్ చేశారని అభిమానులు సంబరపడుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా .. బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: