
వెండితెరపై పుష్పరాజ్ - శ్రీవల్లి జోడి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం మెచ్చి సూపర్ హిట్ కొట్టిన కాంబినేషన్ ఇది పుష్ప వన్ సినిమాలతో ఇద్దరు పేరు దేశవ్యాప్తంగా మారి మోగిపోయింది. మళ్ళీ ఈ కాంబినేషన్ కలిసేది పుష్ప 2 సినిమాతోనే ..! మొన్నటి వరకు అందరూ ఇలాగే అనుకున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలోని రష్మికను రిపీట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులోకి రష్మిక మందన్న ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి బన్నీ - అట్లీ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే ఆల్రెడీ లాక్ అయి ఉంది. రేపో మాపో ఆమె సెట్స్ మీదకు కూడా రాబోతుంది.
రెండో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఇలా ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇక రష్మికను తీసుకోవడానికి హీరో అల్లు అర్జున్ ద్వారా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం రష్మిక ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయినా బన్నీ ప్రాజెక్టు కాబట్టి ఎలాగోలా కాల్ సీట్లు సర్దుబాటు చేసుకుని వచ్చేస్తుంది. ఏదేమైనా మళ్లీ వెంటనే రష్మిక ను బన్నీ రిపీట్ చేస్తుండడంతో ఈ కాంబినేషన్ ఎంజాయ్ చేసే వారికి మాంచి వీనుల విందే అని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు