
నాగార్జున , ఉపేంద్ర , అమీర్ ఖాన్ వంటి భారీ స్టార్స్ కూడా ఉన్నారు .. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ , సాంగ్స్ మాస్‌ను బాగా ఆకట్టుకున్నాయి
.. ట్రైలర్ లేకుండా నే సినిమా బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందట ! దీంతో ట్రైలర్ రొటీన్‌ని పక్కన పెట్టి... నేరుగా థియేటర్స్‌లో బ్లాస్ట్ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట ! ట్రైలర్ లేదు అంటే ఏమవుతుంది ? ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేస్తే కథ పై ఓ క్లారిటీ వస్తుంది . పాత్రల బేస్ , టోన్ అన్ని బయటపడతాయి . కూలీ టీం ప్లాన్ ఏంటంటే...
“కథ, పాత్రలు అన్ని తెర పై చూసేంత వరకూ సస్పెన్స్‌లో ఉంచేయాలి !” ఈ ప్రయోగం కొత్తదే. ట్రైలర్ లేకుండానే ప్రేక్షకుల్లో మూవీ పై అంచనాలు పెంచాలని గేమ్ ప్లాన్ చేస్తున్నారు. వర్కౌట్ అయితే .. ఈ ట్రెండ్ రివల్యూషన్ ఖాయం ! ఇప్పటి దాకా సినిమా కు ట్రైలర్ తప్పనిసరి గా భావించేవాళ్లకి ఇది ఓ ఐఓపెనర్ అయ్యే ఛాన్స్ ఉంది . ఇక పై బడా స్టార్లు కూడా “కంటెంట్ స్ట్రాంగ్ అయితే , ట్రైలర్ ఎందుకు ?” అన్న దిశ గా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది . ట్రైలర్ లేకుండా నే థియేటర్ కు రావాలనుకుంటున్న ‘కూలీ’, రజనీ స్టామినా మీద బ్లైండ్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్న టీం , ట్రెండ్ సెట్టర్ అవుతుందా.. లేక రిస్క్ వెనకాలే పడిపోతుందా అనేదే పెద్ద సస్పెన్స్ ..