సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ మూవీ ఇన్స్పిరేషన్ తో అనేక మూవీలు వస్తూ ఉంటాయి అనే విషయాలను అనేకమంది అనే సందర్భాలలో చెప్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు క్రితం విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా పరుశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే రష్మిక మందన క్రేజ్ ఈ సినిమాతో సూపర్ గా పెరిగింది. దర్శకుడిగా పరశురామ్ కి కూడా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

ఇకపోతే ఈ సినిమాను ఓ మూవీలోని ఒక చిన్న సన్నివేశం ఇన్స్పిరేషన్ తో పరుశురామ్ రూపొందించినట్లు ఓ నిర్మాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.  అసలు విషయంలోకి వెళితే ... దేశవ్యాప్తంగా నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏ ఏం రత్నం కుమారుడు అయినటువంటి రవి కృష్ణ కొంత కాలం క్రితం 7/G బృందావన కాలనీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమాలో బస్సులో ట్రావెల్ చేస్తున్న సమయంలో డ్రైవర్ ఒక్క సారిగా సడన్ బ్రేక్ వేయగానే రవి కృష్ణ చెయ్యి సోనియా బ్లౌజ్ లోకి వెళుతుంది. దానితో రవి కృష్ణ కావాలి అనే ఆ పని చేశాడు అనే ఉద్దేశంతో సోనియా అతని చెంపపై కొడుతుంది. ఇకపోతే తాజాగా రవి కృష్ణ తండ్రి అయినటువంటి ఏ ఏం రత్నం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నన్ను ఒక సారి పరుశురాం కలిసినప్పుడు 7/G బృందావన్ కాలనీ సినిమాలోని బస్సు సన్నివేశం సీన్ ఇన్స్పిరేషన్ తోనే నేను గీత గోవిందం సినిమాను చేశాను. ఆ సినిమాలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగానే రవి కృష్ణ చెయ్యి సోనియా బ్లౌసులోకి వెళుతుంది. ఆమె తప్పుగా అపార్థం చేసుకుంటుంది.

ఆయనను కొడుతుంది. ఇక గీత గోవిందం సినిమాలో కూడా విజయ్ , రష్మిక ఓ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా రష్మికను విజయ్ ముద్దు పెట్టుకుంటాడు. దానితో రష్మిక , విజయ్ ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. దానితోనే సినిమా మొత్తం ముందుకు వెళుతుంది. 7/G బృందావన్ కాలనీ మూవీలోని ఆ చిన్న సీన్ ఇన్స్పిరేషన్ తో గీత గోవిందం సినిమా కథ రాసినట్లు పరశురామ్ నాకు చెప్పాడు అని ఏ ఏం రత్నం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd