- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

2025 లో టాలీవుడ్ లో ఫస్ట్ ఆఫ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అద్భుతాలు జరగలేదు. 10 % విజయాలు కూడా దక్కలేదు. హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు బోల్తా పడ్డాయి. వస్తాయి అనుకున్న సినిమాలు వాయిదాలు వెతుక్కుంటున్నాయి. అలా ఫస్ట్ అఫ్ చాలా డల్ గా సాగింది. సంక్రాంతి మెరుపులు మినహాయిస్తే సమ్మర్ సీజన్ మొత్తం వృధా అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ ఆశలు అన్ని సెకండాఫ్ మీదే ఉన్నాయి. వచ్చే నాలుగు వారాలు సినిమా పరిశ్రమకు చాలా కీలకం. హరిహర వీరమల్లు - కింగ్‌డ‌మ్ - వారు 2 - కూలి ఈ నాలుగు సినిమాలు ధియేటర్లను షేక్ చేసే సినిమాలు. బాక్సాఫీస్ మళ్ళీ కళకళలాడాలన్న .. హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాలన్న ఈ నాలుగు సినిమాలు నిలబడటం అత్యవసరం. ఈనెల 20న హరిహర ఈవ‌రమల్లు వస్తోంది. ఈ సినిమా కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. నాన్ థియేటర్ నుంచి 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిర్మాత చెప్పిన రేటుకు బయ్యర్లు ఈ సినిమా కొనేస్తే రిలీజ్ ముందే నిర్మాత సేఫ్ అవుతారు.


పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా కాబట్టి కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సినిమా ఏమాత్రం నిలబడిన బాక్సాఫీస్ కళ‌కళ లాడుతుంది. వీరమల్లు వచ్చిన వారానికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ వస్తుంది. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా రోజులు అయింది. 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. బడ్జెట్ పరంగా చాలా రిస్కు పెట్టారు. అయితే నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కింగ్డమ్ తర్వాత ఆగస్టు 14న కూలి - వార్ 2  రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. రెండు క్రేజీ ప్రాజెక్టు లే. వార్ 2 లో ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్. 400 కోట్లు ఈ సినిమా ఖర్చు పెట్టారు. అయితే సౌత్ లో భారీ అంచనాలతో వస్తున్న కూలీ ని తట్టుకుని వార్ 2 ఎంతవరకు నిలబడుతుంది అన్న ప్రశ్న ఉంది. రజినీకాంత్ - నాగార్జున - ఉపేంద్ర - అమీర్ ఖాన్ - శృతిహాసన్ - లోకేష్ కనకరాజ్‌ ఇలా భారీ తారాగ‌ణం ఉంది. ఈ సినిమాకు కూడా 400 కోట్లు ఖర్చు పెట్టారు అంటే నాలుగు వారాల్లో 1200 కోట్లతో టాలీవుడ్ లో బిగ్ బెట్టింగ్‌ జరగబోతుంది. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమాలు హిట్ అవుతాయి ఏమిటి అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: