కోట శ్రీనివాసరావు మరణ వార్త విని  సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది.. రీసెంట్ గానే ఆయన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. బండ్ల గణేష్ తో కోట దిగిన ఫోటో చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఇదేంటి కోట శ్రీనివాసరావు గుర్తుపట్ట లేకుండా మారిపోయారు అని అనుకున్నారు. ఈ ఫోటో బయటికి వచ్చిన కొంతకాలానికే ఆయన మరణ వార్త వినడం నిజంగా బాధాకరం.అయితే కోటా శ్రీనివాసరావు బతికున్నన్ని రోజులు చచ్చిన పేను లాగే ఉన్నారు. దానికి కారణం ఆయన కొడుకు మరణమే..కళ్ళముందే చెట్టంత కొడుకును పోగొట్టుకున్న కోటా శ్రీనివాసరావు ఎంతో కృంగిపోయారు. ముఖ్యంగా కొడుకు చనిపోయాక తాగుడికి బానిస అయ్యారు.. అయితే అలాంటి కోట శ్రీనివాసరావుని జీవితకాలం ఓ శాపం వెంటాడిందట. అదేంటంటే యాక్సిడెంట్లు.. ఇక విషయంలోకి వెళ్తే.. కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. 

అయితే కొడుకు మాత్రమే కాదు కూతురికి కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందట. ఇక విషయంలోకి వెళ్తే..కోటా శ్రీనివాసరావుకి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ఇందులో ఓ కుమారుడు మరణించాడు.అయితే ఈ ఇద్దరు కుమార్తెలలో ఓ కుమార్తె కూడా చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిందట. ఇక అసలు విషయం ఏమిటంటే..కోటా కుతురికి రిక్షా ఎక్కాలనే ఆతృత చాలా ఉండేదట. ఇక అప్పట్లో ఓసారి విజయవాడ వెళ్ళినప్పుడు తన బంధువుల పిల్లలతో పాటు కూతుర్ని కూడా రిక్షా ఎక్కించారట.కానీ అదే సమయంలో రోడ్డు మీదకు బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చి కూతురు ఉన్న రిక్షాను ఢీ కొనడంతో పాటు అక్కడున్న కొంతమంది మీదికి లారీ దూసుకెళ్లింది. దాంతో ఈ లారీ ప్రమాదంలో నలుగురు మరణించారట. కానీ తన కూతురు చావు నుండి బయటపడింది.

అయితే ఒక కాలు మాత్రం పోగొట్టుకుందట. అలా తన కూతురు రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది అనే విషయాన్ని కోట ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.ఆ తర్వాత అంతా హ్యాపీగానే ఉంది.ఇక అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత కోట కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఇక కొడుకు మరణ వార్త విని కోటా శ్రీనివాసరావు చాలా కృంగిపోయారు. కళ్ళ ముందే చెట్టంత కొడుకుని పోగొట్టుకోవడంతో కోటా శ్రీనివాసరావు బాధ వర్ణతాతీతం. అలా కోట శ్రీనివాసరావు జీవితకాలం రోడ్డు ప్రమాదాలు ఆయన్ని వెంటాడాయి. దీంతో చాలామంది కోట శ్రీనివాసరావు కూతురు రోడ్డు ప్రమాదంలోనే కాలు పోగొట్టుకుంది. అలాగే కొడుకు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు అంటే ఈయనకు ఏదైనా శాపం ఉంది కావచ్చు అని మాట్లాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: