ఒక నిర్మాత ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఓ మూవీ ని రూపొందించిన సందర్భంలో ఆ సినిమా నిర్మాతకు అనేక రకాలుగా డబ్బులు వస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఓ సినిమాను రూపొందించిన సందర్భంలో ఆ మూవీ కి థియేటర్ బిజినెస్ ద్వారా డబ్బులు వచ్చేవి. అలాగే సాటిలైట్ మరియు మ్యూజిక్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చాయి. ఇక సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధిస్తే ఆ మూవీ యొక్క డబ్బింగ్ , రీమేక్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చేవి. దీనితో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రదర్శన చేయకపోయినా నిర్మాత అంతో ఇంతో సేఫ్ జోన్ లోకి వెళ్లేవాడు.

ఇక ప్రస్తుత కాలంలో ఓ నిర్మాత సినిమాను నిర్మించినట్లయితే ఆ మూవీ కి థియేటర్ హక్కుల ద్వారా , సాటిలైట్ మ్యూజిక్ హక్కుల ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇక ఓ టి టి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి.  ఓ టి టి ప్రభావం భారీగా పెరగడంతో నిర్మాతలకు డబ్బింగ్ , రీమేక్ హక్కుల ద్వారా పెద్దగా డబ్బులు రావడం లేదు. ఏదైనా ఒక సినిమాకు ఓ టీ టీ డీల్ పెద్ద స్థాయిలో జరిగింది అంటే ఆ మూవీ ఈజీగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.

మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను సంస్థ ఏకంగా 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఓ టి టి ద్వారానే 50 కోట్లు రావడంతో ఈ సినిమా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ కి ఇంత పెద్ద ఓ టీ టీ డీల్ జరగడంతో ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ సూపర్ లక్కీ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd