
షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ జరుపుకుంటున్న కూలీ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 2న ట్రైలర్ బయటకు రానుంది. ఇప్పటికే కూలీపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ ద్వారా చిత్రబృందం మరింత హైప్ పెంచుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కూలీ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్ లెక్కలు నెట్టింట వైరల్ గా మారాయి.
హీరో రజినీకాంత్ కెరీర్ లో 171వ చిత్రమిది. ఇందులో ఆయన దేవా పాత్రలో కనిపించబోతున్నారు. అయితే కూలీ మూవీకి గానూ ఆయన రూ. 150 కోట్ల రేంజ్‌లో పారితోషికం అందుకున్నారట. అలాగే విలన్ గా సైమన్ పాత్రలో నాగార్జున నటించారు. అందుకోసం ఆయన రూ. 24 కోట్లు ఛార్జ్ చేశారట. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూలీ మూవీలో ఓ చిన్న అతిధి పాత్రను పోషించారు. అయినప్పటికీ ఆయన రూ. 25 కోట్లు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
అదేవిధంగా, కన్నడ స్టార్ ఉపేంద్ర రూ. 10 కోట్లు, హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ రూ. 4 కోట్లు, స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డే రూ. 2 కోట్లు పుచ్చుకున్నారని సమాచారం అందుతోంది. ఇక కెప్టన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ కోసం రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించడం విశేషం.