మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినీ గడప తొక్కిన జూనియర్ ఎన్టీఆర్.. యాక్టింగ్, యాక్షన్, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటిలోనూ తనదైన ముద్ర వేసి భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నాడు. నందమూరి లెగసినే ముందుకు నడిపిస్తూ తాతకు తగ్గ మనవడని జేజేలు కొట్టించుకున్నాడు. నందమూరి బ్రాండ్ కు ఐకాన్ అయిన తారక్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు.


అయితే ఆన్ స్క్రీన్ పై త‌న యాక్టింగ్ తో తోటి న‌టీన‌టుల‌కు, యాక్ష‌న్ స‌న్నివేశాల్లో విల‌న్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించే ఎన్టీఆర్‌.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఓ వ్య‌క్తికి తెగ భ‌య‌ప‌డ‌తాడ‌ని మీకు తెలుసా? పేరుకు గ్లోబల్ స్టార్ అయిన ఆ వ్య‌క్తిని చూస్తే మాత్రం తార‌క్ వణికిపోతార‌ట‌. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు తారక్ పెద్ద‌ కుమారుడు అభ‌య్ రామ్. నిజానికి అభ‌య్ రామ్ కొడుకు కాదు ఒక క్వ‌శ్చ‌న్ బ్యాంక్ అట‌.


ఏదేనా క‌నిపిస్తే చాలు ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేస్తూనే ఉంటాడు. అన్నింటికీ చాలా ఓపిగ్గా స‌మాధానాలు చెబుతాం. ఒక్కోసారి వాడేం అడుగుతాడా అని భ‌యం వేస్తుంటుంది.. అందుకే కొన్నిసార్లు అభ‌య్ ను చూసి పారిపోతుంటా. ఆ టైమ్‌లో వాడికి ప్ర‌ణ‌తి బ‌లైపోతుంది అంటూ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ స‌రాదాగా వెల్ల‌డించారు. ఆయ‌న కామెంట్స్ ఇప్పుడు మ‌రొక్క‌సారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: