టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి అనే మూవీలను మొదలు పెట్టాడు. ఈ మూడు సినిమాలను మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీ కావడంతో ఈ మూడు సినిమాల షూటింగ్లను పక్కన పెట్టి రాజకీయాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు ముగిసిన కొంత కాలానికి పవన్ ఈ మూడు మూవీల షూటింగ్లను ముగించడానికి సిద్ధం అయ్యాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను షూటింగ్ను కంప్లీట్ చేశాడు. ఈ మూవీ ఈ నెల 24 వ తేదీన విడుదల కానుంది. ఓజి సినిమా విడుదల తేదీని కూడా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన రెండు అదిరిపోయే క్రేజీ అప్డేట్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సినిమా షూటింగ్ను జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజి మూవీ కి సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్  మూవీ కి సంబంధించిన టీజర్ను , అలాగే ఓజి మూవీ కి సంబంధించిన ట్రైలర్ను రెండింటిని కూడా పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే గాని జరిగితే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే రేంజ్ ట్రేట్ రెడీ అవుతున్నట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: