
మారుతున్న కథ – రీమేక్ ప్లాన్? .. సురేందర్ రెడ్డి మొదట చెప్పిన కథకు పవన్ ఎక్కువ డేట్స్ ఇవ్వలేనని క్లియర్‌గా చెప్పారట. కారణం – రాజకీయ బాధ్యతలు ! అందుకే ఈ స్టేజిలో ఎక్కువ బడ్జెట్ , టైమ్ అవసరమైన స్ట్రైట్ స్క్రిప్ట్ చేయలేరని, బదులుగా ఒక తమిళ రీమేక్ తీసుకురావాలని పవన్ సూచించాడట. ఇది సురీకి షాక్ ఇచ్చినా... పవన్‌తో సినిమా అంటే లైఫ్‌టైం ఛాన్స్ కాబట్టి, ఎస్ అనాల్సిందే! సురీకి కొత్త టెస్టు – ఫాస్ట్ & మాస్! .. "ఏజెంట్" ఫలితం అతడిపై ఉన్న నమ్మకాన్ని పోగోటింది. ఇప్పుడు పవన్ వంటి మాస్ స్టార్‌తో మరో అవకాశం దక్కడం అంటే ఆయనకు గేమ్ చేంజర్ టైమ్. కానీ పవన్ పెట్టిన కండీషన్ మాత్రం స్పష్టంగా ఉంది – వేగంగా, సమర్థంగా తీసే డైరెక్టర్ అయితేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ! సురీ తన స్టైల్ మార్చుకోక తప్పదు. లేకపోతే మరోవాళ్లకు ఛాన్స్ వెళ్లే ఛాన్స్ ఉంది.
ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కడంటే ... ఈ ప్రాజెక్ట్ బిజినెస్‌కి వస్తే... రామ్ తాళ్ళూరి ఇప్పటికే ఈ సినిమా కోసం చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్న నిర్మాత. ఆయనకు పవన్ సినిమా రిజర్వ్‌గా ఉంది. ఇప్పుడు అది మళ్లీ యాక్టివ్ అయితే. .. అది , నేషనల్ మీడియాలో హైప్ తెచ్చే విషయం ! కానీ ఇది గాసిప్ స్టేజ్ లోనే ఉందని టాక్. ఇంకా ఎన్నికలకి నాలుగేళ్లు టైం ఉంది. ఈ గ్యాప్‌లో 1-2 సినిమాలు కచ్చితంగా చేయాలనుకుంటున్న పవన్, రిస్క్ తగ్గించి ఫాస్ట్ రన్ స్క్రిప్ట్స్ మీద దృష్టి పెడుతున్నారు. మరి సూరి స్లో మోషన్ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్‌కి వస్తాడా? లేక రీమేకతోనే మాస్ టేకాఫ్ దక్కించుకుంటాడా ? ఫ్యాన్స్ మాత్రం మాసివ్ ఎనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు!