ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఎట్టకేలకు కింగ్డమ్ మూవీ తో హిట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈ సినిమా చూసిన నెటిజెన్స్ అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని కింగ్డమ్ మూవీ తో విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడడం ఖాయం అంటూ రివ్యూలు ఇస్తున్నారు. అయితే సినిమా చూసిన చాలామంది రివ్యూ ఇస్తున్నారు కాబట్టి ఆ రివ్యూలకు తగ్గట్టుగా తాజాగా రష్మికా మందన్నా పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కింగ్డం మూవీకి సంబంధించి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది వీరి అభిమానులు సంబరపడిపోతున్నారు. 

మరి ఇంతకీ రష్మిక మందన్నా కింగ్డమ్ మూవీని ఉద్దేశించి పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది చూస్తే.. రష్మిక తాజాగా కింగ్డమ్ మూవీకి సంబంధించి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ.. "ఈ విజయం నిన్ను ప్రేమించే వారికి నీకు అందరికీ చాలా ముఖ్యమైనది అని నాకు తెలుసు.. అంటూ పోస్ట్ పెట్టడమే కాదు మనం కొట్టినం అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చింది. అయితే రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ కి విజయ్ దేవరకొండ కూడా అవును మనం కొట్టినం అని రిప్లై ఇవ్వడంతో వీరిద్దరికి సంబంధించిన ఈ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. 

అయితే ఈ ట్వీట్స్ చూసిన చాలా మంది విజయ్ దేవరకొండ అభిమానులు ఈ హ్యాపీ మూమెంట్ లో మీ ఇద్దరి పెళ్లికి సంబంధించిన పెళ్లి తేదీని అనౌన్స్ చేయొచ్చు కదా అంటూ ఫ్యాన్స్ ఎంతో క్యూట్ గా కామెంట్లు పెడుతున్నారు.మరి కింగ్డమ్ హిట్ జోష్ లో విజయ్ దేవరకొండ తన ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక డియర్ కామ్రేడ్ సినిమా నుండి విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: