
అందులో ఇండియన్ మార్కెట్ నుంచి రూ.240 కోట్ల గ్రాస్ వచ్చింది. నెట్ వసూళ్ల విషయానికి వస్తే రూ.196.50 కోట్లను ఈ సినిమా సాధించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ మంచి స్పందన లభించింది. అక్కడి నుంచి రూ.60.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని నిర్మాతలు తెలిపారు. ‘వార్ 2’ వసూళ్లపై ఒక విధంగా ప్రభావం చూపిన సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’. అదే రోజున రిలీజ్ కావడంతో రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో భాగంగా కొంతమంది ‘కూలీ’ వైపు మొగ్గు చూపడం, టికెట్ రేట్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ‘వార్ 2’ కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో లేవు. అయినా తొలి వారం రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరడం మాత్రం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి.
సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. ఆమె గ్లామర్, యాక్షన్ ఎపిసోడ్లు, హృతిక్-ఎన్టీఆర్ మధ్య ఉన్న క్లాష్‌లు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉండటం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే తెలుగు గడ్డపై సినిమా కలెక్షన్లు రాబట్టడం లేదు. కొందరు అభిమానులు ఆయన నటనను మెచ్చుకున్నా, కొందరికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రతినాయకుడిగా చూడటం నచ్చలేదు.