పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వానికి, మాటతీరు, స్టైల్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రతి సంవత్సరం అభిమానుల కోసం ఒక పండుగలా మారిపోతుంది. ఈ ఏడాది కూడా పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2వ తేదీన చాలా గ్రాండ్‌గా జరుపుకునేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పవన్ అభిమానులకు డబుల్ ధమాకా రాబోతోంది. ఆ రోజు ఆయన నటించిన “జల్సా”, “తమ్ముడు” సినిమాలు రెండూ రీ-రిలీజ్ కానున్నాయి. నిజానికి రీ-రిలీజ్ మూవీస్ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో పవన్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన హంగామా ఉంటుంది. ఇప్పటికే “గబ్బర్ సింగ్”, “ఖుషి” రీ-రిలీజులు టాప్ 10లో చోటు సంపాదించాయి. అదే రేంజ్ లో ఇప్పుడు “జల్సా”, “తమ్ముడు” కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రత్యేకించి “జల్సా” సినిమాలో పవన్ చూపిన ఎనర్జీ, ట్రెండీ స్టైల్ ఇప్పటికీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


అయితే ఈ రీ - రిలీజ్‌లకన్నా అభిమానుల కళ్ళంతా పడిన సినిమా “ఓజీ”. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో మళ్లీ ఒక మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. పవన్ గతంలో సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన మూడు సినిమాలు మిక్స్ రిజల్ట్స్ ను ఇచ్చాయి. 2004లో వచ్చిన “గుడుంబా శంకర్”, 2010లో వచ్చిన “పులి” ఫ్లాప్స్ కాగా, 2013లో వచ్చిన “అత్తారింటికి దారేది” మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పవన్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తరువాత నుండి పవన్ కి ఆ స్థాయి సక్సెస్ అందకపోవడం గమనార్హం.


అందుకే ఈసారి సెప్టెంబర్ లో రాబోతున్న “ఓజీ” పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా తప్పకుండా “అత్తారింటికి దారేది” సెంటిమెంట్ ఫాలో అవుతూ సూప‌ర్ హిట్ అయ్యి ప‌వన్ కెరీర్ కి మళ్లీ గోల్డెన్ ఎరా ప్రారంభిస్తుందని ఫ్యాన్స్ న‌మ్మ‌కంగా ఉన్నారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ పవన్ అభిమానులకు రీ-రిలీజుల రూపంలో డబుల్ ఫెస్ట్ ఇచ్చి, చివరగా “ఓజీ”తో మూడింతల సంతోషాన్ని అందించబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: